సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ 2023- 24 వార్షిక బడ్జెట్ ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి నేడు, గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం 2లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. ముందుగా పోతన పద్యంతో బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి మొదలుపెట్టారు. బడ్జెట్ ముఖ్యాంశాలు…ఆర్థిక శాఖకు రూ.72,424 కోట్లు కేటాయింపు జరిగింది. వైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లు,వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1787 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ.23,509 కోట్లు, హోంశాఖకు రూ.8206 కోట్లు, గృహనిర్మాణ శాఖకు రూ.6292 కోట్లు, గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3858 కోట్లు,నీటిపారుదల రంగానికి రూ.11,908 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యం రూ.2602 కోట్లు,మౌలిక వసతులు, పెట్టుబడులకు రూ.1295 కోట్లు,పట్టణాభివృద్ధికి రూ.9381 కోట్లు కేటాయింపు, మైనార్టీ సంక్షేమానికి రూ.2240 కోట్లు, నగదు బదిలీ పథకాలకు రూ.54 వేల కోట్లు , పట్టణాభివృద్ధికి రూ.9381 కోట్లు కేటాయింపు,మైనార్టీ సంక్షేమానికి రూ.2240 కోట్లు కేటాయింపు,అగ్రవర్ణ పేదల సంక్షేమానికి రూ. 11,085 కోట్లు,సాంఘిక సంక్షేమం రూ.14511 కోట్లు, R&Bకి రూ.9119 కోట్లు,స్త్రీ, శిశు సంక్షేమం రూ.3951 కోట్లు,డీబీటీ స్కీమ్‌లకు రూ.54,228.36 కోట్లు , పెన్షన్లు రూ.21,434 కోట్లు,రైతు భరోసాకు రూ.4020 కోట్లు,జగనన్న విద్యా దీవెనకు రూ.2842 కోట్లు, వసతి దీవెనకు రూ.2200 కోట్లు, వైఎస్సార్ పీఎమ్ బీమా యోజనకు రూ. 700 కోట్లు,కాపు నేస్తం రూ.550 కోట్లు,జగనన్న చేదోడుకు రూ.350 కోట్లు,ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు,వైఎస్సార్ ఆసరా రూ.6700కోట్లు, వైఎస్సార్ చేయూత రూ.5000 కోట్లు. అమ్మఒడి రూ.6500 కోట్లు, బీసీ కార్పొరేషన్‌కు రూ.22,715 కోట్లు,ఎస్పీ కార్పొరేషన్‌కు రూ.8384.93 కోట్లు,ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2428 కోట్లు, ఈబీసీ కార్పొరేషన్‌కు రూ.6165 కోట్లు,మైనారిటీ కార్పొరేషన్‌కు రూ.1868.25 కోట్లు కీలక కేటాయింపులు చేసారు
