సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో గడుపుతున్న టీడీపీ అధినేత, చంద్రబాబు రిమాండ్ పొడిగింపుపై నేడు, గురువారం ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. జైలులో ఉన్న చంద్రబాబుతో న్యాయమూర్తి వీడియో లైవ్ లో మాట్లాడారు. తన భద్రతా ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన ఉన్నట్లు చంద్రబాబు తెలపగా వ్రాత పూర్వకంగా సమస్యలను తన దృష్టికి తెస్తే వాటిని పరిశీలించి తగు ఆదేశాలు ఇస్తానని న్యాయమూర్తి తెలిపారు. అనంతరం చంద్రబాబు రిమాండ్‌పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. నవంబర్ 1 వరకూ రిమాండ్‌ పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో ఈ దసరా కు చంద్రబాబు బయటకు వస్తారని ఆశించిన టీడీపీ శ్రేణులు మరోసారి నిరాశ చెందాయి. లోకేష్ తో పాటు ఇక చంద్రబాబు భార్య భువనేశ్వరి కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ కు భరోసాగా పర్యటించాలని షెడ్యూలు తయారు చేసుకొంటున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *