సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలకు ఇంకా సుమారు ఏడాది సమయం ఉండగానే రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగిపోయింది. అధికార వైసిపి , టీడీపీ , జనసేన సోషల్ మీడియా క్యాడర్ ఇప్పటికే పలు యూ ట్యూబ్ లో, ఛానెల్స్ లో వీడియో ప్రచారాలు లో అవతల పార్టీల పాలనను విమర్శిస్తూ, గుర్తు చేస్తూ పలు వీడియోలు, పాటలను ఇప్పటికే విడుదల చేస్తూ పోటీ పడుతున్నారు. అయితే తాజగా తెలుగు దేశం అధినేత చంద్రబాబు మరో అడుగు ముందుకు వేస్తూ తానే స్వయంగా తన ట్విటర్లో ఏపీలో జగన్ సర్కార్ గత 4 ఏళ్ళు పాలనను విమర్శిస్తూ .. ఓ వీడియోను విడుదల చేశారు. ‘ఇది రాష్ట్రమా..? రావణ కాష్ఠమా?’ అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల జరుగుతున్నాయని వాటి గురించి ప్రశ్నిస్తూ తాజాగా వీడియో రిలీజ్ చేశారు. నాలుగేళ్ల నరకమంటూ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని దానికి జగన్ సర్కార్ కారణమని ఆరోపిస్తూ పలు ఘటనల్ని ఇందులో ఉదహరించారు.
