సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు నేడు శుక్రవారం కొద్దీ నిమిషాల క్రితం కన్నుమూశారు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా . అనారోగ్యంతో బాధపడుతున్నారు.. దీంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో గత వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో కొద్దిసేప‌టి క్రితం ఆయ‌న మ‌ర‌ణించారు. నారా రామ్మూర్తినాయుడు 1952లో నారా కర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతుల రెండో సంతానంగా జన్మించారు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు హీరో రోహిత్‌ కాగా.. మరొకరు నారా గిరీష్. రామ్మూర్తి నాయుడు 1994లో చంద్రగిరి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత అన్న చంద్రబాబు తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి కొంతకాలానికి అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు పూర్తిగా దూరమై ఇంటికే పరిమితమయ్యారు కాగా, మ‌ర‌ణించిన‌ స‌మ‌యంలో రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ , చంద్ర‌బాబు నాయుడు కుమారుడు లోకేష్ అక్క‌డే ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సోద‌రుడి మర‌ణ వార్త తెలియ‌డంతో అన్ని కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేసుకుని ఢిల్లీ నేరుగా విమాానంలో హైదరాబాద్ కు చంద్రబాబు బయలుదేరారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *