సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు నేడు, శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ లో మాట్లాడుతూ.. ఎంతో అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణంలో 2014 సంవత్సరంలో సుమారు రూ 40 కోట్లతో యనమదుర్రు డ్రెయిన్ పై 3 బ్రిడ్జిలను నిర్మించడం జరిగిందని, ఇప్పటికి ఆ బ్రిడ్జి లకు అప్రోచ్ రోడ్ లు మాత్రం వెయ్యలేక గత శతాబ్దంగా పెండింగ్ లో ఉందని ఆ ప్రాంతాలలో ఆక్వా ఫ్యాక్టరీ లు, విద్య సంస్థలు ఎక్కువ ఉండటంతో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయిందని , కట్టిన బ్రీజ్ లు వాటికీ అనుసంధానంగా రోడ్డులు కలపకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయని వాటిని పూర్తీ చెయ్యవలసిన బాధ్యత మన ప్రభుత్వం ఫై ఉందని కోరారు. దీనికి స్పీకర్ అయ్యన పాత్రుడు సంబధిత మంత్రి ఈ సమస్యను నోట్ చేసుకోవాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *