సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 30వ తేదీ నుండి 2వ తేదీ వరకు 3 రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ‘ఇదేం కర్మ..ఈ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగం గా డిసెంబరు 2న డిసెంబరు 2న సాయంత్రం 6 గంటలకు తాడేపల్లిగూడెంలో చంద్రబాబునాయుడు పర్యటన ఉంటుందని, జిల్లా వ్యాప్తంగా నేతలు కార్యకర్తలు పాల్గొనాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు, తోట సీతారామలక్ష్మి ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో చంద్రబాబు పర్యటన మరియు బహిరంగ సభకుసంబంధించి ఇప్పటికే స్థానిక, జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలతో సీతారామలక్ష్మి తో పాటు ఉండి ఎమ్మెల్యే రామరాజు మరియు ,పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్సీ లు,అంగర, మంతెనలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ అధ్యక్షుడు వలవల మల్లికార్జునరావు (బాబ్జీ), జిల్లాతెలుగు రైతుసంఘం అడ్జక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొంటున్నారు.
