సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబుపై నేడు, గురువారం మరో సీఐడీ కేసు నమోదైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు పాల్బడ్డారని ఖజానాకు తీవ్ర నష్టం చేశారనే ఫిర్యా దుతో సీఐడీ. ఏపీఎమ్డీసీ ఇచ్చి న ఫిర్యా దుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఈ కేసులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ టీడీపీ మంత్రి ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని ప్రభాకర్, ఏ-4గా మాజీ మంత్రి దేవినేని ఉమాలు ఉన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి.అని నిర్ధారిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్,రూ. 100 కోట్ల జరిమానా విధించింది ఇంకా అప్పట్లో పశ్చిమ గోదావరి జిల్లా , కృష్ణ జిల్లా సరిహద్దులో ఇసుక అక్రమ తవ్వ కాలకు అడ్డుపడ్డ అప్పటి మహిళా ఎమ్మార్వో వనజాక్షి పై నాటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెగబడ్డ ఉదంతం అప్పటిలో రాజి అయినప్పటికీ తిరిగి ఈ కేసులో అనుసంధానించే అవకాశం కనపడుతుంది.
