సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ తో తాను రాష్ట్రంలో ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరిన నేపథ్యంలో నేడు, మంగళవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి .మీడియా సమావేశంలో చంద్రబాబు సవాల్ కు తాము సిద్ధమేనని అయితే సీఎం జగన్ బదులు ఒక వైసీపీ నేత చంద్రబాబు కూర్చుని జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి బహిరంగంగా వివరిస్తారని, అసలు 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలకు చేసిన మంచి ఏమిటో తప్పక నిలదీస్తారని ప్రకటించారు. ఎలానూ అధికారంలోకి రారని తెలిసి చంద్రబాబు గొప్పకోసం ఎన్ని ఛాలంజ్ లు అయిన చేస్తారని, తన స్వలాభం తప్ప ప్రజల కోసం ఏం సంక్షేమం చేశారని చం ద్రబాబు ఓటు అడుగుతారని ప్రశ్నిం చారు. తాము నాలుగున్నరేళ్లుగా మధ్యవర్తులు లేకుండా రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోజమ అయింది వాస్తవం కాదా? అని సజ్జల ప్రశ్నించారు. జగన్ సిద్ధం సభలకు జనస్పందన చూసి చంద్రబాబు షాక్ కు గురై ఎదో కామిడి మాటలు మాట్లాడి పచ్చమీడియాలో హడావిడి చేస్తుంటాడని ఎద్దేవా చేసారు సజ్జల..
