సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి లో ప్రయాణికుల రద్దీ ని దృష్టిలో పెట్టుకొని , దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి కాకినాడ టౌన్ & చర్లపల్లి – నరసపూర్ మధ్య ప్రత్యేక రైళ్ల ను క్రింద వివరించిన విధంగా పొడిగిస్తుంది ..పశ్చిమ గోదావరి జిల్లా ‘తాడేపల్లిగూడెం , ఏలూరు మీదుగా’ రైలు నంబర్ :07031చర్లపల్లి నుండి కాకినాడ టౌన్ వరకు 02.05.2025 నుండి 27.06.2025 వరకు 9 సర్వీసులు పొడిగించబడినవి. 19.20 కు బయలు దేరి ఉదయం 04.30 కు కాకినాడ చేరుకొంటుంది. రైలు నెంబర్ 07032 కాకినాడ టౌన్-నుండి 18.55 కు బయలు దేరి మరుసటి ఉదయం చర్లపల్లి కి 06.50 కి చేరుకొంటుంది. 04.05.2025 నుండి 29.06.2025 వరకు 9 సర్వీసులు కొనసాగిస్తారు. ఇక ‘భీమవరం,ఆకివీడు మీదుగా’ రైలు నెంబర్ 07233 చర్లపల్లి నుండి రాత్రి 19.15 కు బయలుదేరి నరసాపూర కు మరుసటి ఉదయం 05.50 కు చేరుకొంటుంది. 02.05.2025 నుండి 27.06.2025 వరకు 9 ప్రత్యేక సర్వీసులు కొనసాగిస్తారు. రైలు నెంబర్ 07234 నరసపూర్ నుండి రాత్రి 20. 20.00కు బయలుదేరి మరుసటి ఉదయం 08.00లకు – చర్లపల్లి చేరుకొంటుంది. 04.05.2025 నుండి 29.06.2025 వరకు 9 సర్వీసులు నడుపుతారు.
