సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కొంతకాలంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెలికాం రంగంలో ప్రఖ్యాత ప్రెవేటు జియో, ఎయిర్ టెల్ సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో వినియోగదారుల కోసం తక్కువ ధరలకే కొత్త ప్లాన్‌లను ప్రకటిస్తున్న నేపథ్యంలో తాజగా సంచలన ఆఫర్ ప్రకటించింది. ఇటివల BSNL ప్రవేశపెట్టిన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ రూ. 1198కి అందుబాటులో ఉంది. ఇది వినియోగదారులకు అద్భుతమైన సేవలను అందిస్తోంది. ఎంత చౌకగా అంటే నెల చొప్పున చూస్తే కేవలం రూ. 99.83 మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతి నెలకు అన్ని నెట్‌వర్క్‌లకు 300 నిమిషాల కాలింగ్ సౌకర్యాన్ని కూడా ఉచితంగా పొందుతారు. ఇది దేశవ్యాప్తంగా రోమింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. దీంతోపాటు ప్రతి నెలా 3GB డేటా కూడా అందించబడుతుంది. అంటే మొత్తం ఏడాది పొడవునా 36GB డేటాను వినియోగించుకోవచ్చు.
