సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చిన్నారుల ఫై దాడులు పెరిగిపోతున్నాయి.నా అనుకొన్న సొంత మనుష్యులే మృగాలా కన్నా హీనంగా ఇలా దాడి చేస్తే ఎవరికి చెప్పుకొంటారు? మావత్వానికి మచ్చ తెచ్చే ఈ దారుణ ఘటన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెంలోనూ జరిగింది. ఓ 10 ఏళ్ళ చిన్నారిపై ‘మారుతండ్రి’? విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆ కుర్రాడి తల్లి కి తనకు మధ్య అడ్డుగా ఉన్నాడని భావించి ఏదొక వంకతో కొన్ని నెలలుగా బాలుడిపై దాడి చేస్తున్న నిందితుడు గాయాలపై కారం చల్లి చిన్నారిని ఫోన్ ఛార్జింగ్ వైర్ తీసుకుని దారుణంగా వాతలు పడేలా కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. తాజాగా నేడు, ఆదివారం ఉదయం సైతం బాలుడిపై దాడి చేశాడు ఆ దుర్మార్గుడు. ఫోన్ ఛార్జింగ్ వైర్ తీసుకుని ఒళ్లంతా రక్తం వచ్చేలా కొట్టాడు. గాయాలపై మళ్లీ కారం చల్లాడు. తనపై దాడి చేయవద్దంటూ బాలుడు ఎంత వేడుకున్నా బోరున విలపిస్తున్న కనికరించలేదు. అయితే చిన్నారి దారుణ బాధాకర పరిస్థితి చూసిన స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఆసుపత్రిలో డాక్టర్స్ కూడా ఆ గాయాలు చూసి నివ్వెరపోయారు. దారుణ కష్టాలలో ఉన్న బాలుడి భవిషత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్చంద సంస్థల ద్వారా రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది. ఆ దాడికి పాలబడిన, మానవ మృగం ఫై కఠినంగా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక పోలీసులు దాడికి పాలబడుతున్న ఆ వ్యక్తిని అదుపులో తీసుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *