సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత, కాస్ట్యూమ్స్ డిజైనర్ సుస్మిత కొణిదెలకు ఏపీలో కూటమి సర్కార్ కీలక గౌరవ పదవి ని అందించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె త్వరలోనే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయం ధర్మకర్తల మండలి లో చిరంజీవి భార్య సురేఖ ను సభ్యురాలుగా నియమించడం అందరికి తెలిసిందే..
