సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 157వ చిత్రానికి సంబంధించి బింబిసార ను రూపొందించిన వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నేడు, మంగళవారం పాటల రికార్డింగ్‌తో మొదలుపెట్టారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఓతాజా వీడియో విడుదల చేసి తెలిపింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. ఈ సోషియో ఫాంటసీ సినిమాలో పంచభూతాలు కథతో..చిరంజీవి సరసన దేవ్యకన్యలు గా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తారని తెలుస్తుంది. సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ ”ఏ సినిమా అయినా రికార్డింగ్‌తో ప్రారంభించడం ఆనవాయితీ. ఆ విధానాన్ని పునరుద్దిస్తూ సెలబ్రేషన్ సాంగ్‌తో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమా పనులు మొదలుపెట్టాం. ఇందులో ఆరు పాటలుంటాయి. ఓ బలమైన కథను దర్శకుడు తన భుజ స్కంధాల మీద వేసుకున్నాడు అని అన్నారు. ఈసినిమా ను హీరో ప్రభాస్ కు చెందినదిగా భావించే యు.వి సంస్థ తమ 14వ సినిమాగా నిర్మిస్తుండటం మరో విశేషం..
