సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగనన్న తోడు పథకానికి సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ప్రభుత్వం చేతివృత్తుల కళాకారులకు ఆర్ధిక సాయం అందిస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారి కుటుంబాలను ఆదుకొనేందుకు రుణాలు, వడ్డీ మాఫీ నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. బ్యాంకుల ద్వారా కొత్తగా రూ. 395 కోట్లు కొత్త రుణాలు మంజూరు చేశామన్నారు. గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ విడుదల చేశామని, సకాలంలో రుణాలు చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తుందన్నారు. రూ. 3.67 లక్షల మంది రెన్యువల్‌గా రుణాలు తీసుకుంటుండగా.. 28 వేల మందికి కొత్తగా రుణాలిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. జగనన్న తోడు ద్వారా వ్యాపారాలు చేసుకునేందుకు చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఎలాంటి గ్యారెంటీ లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలిస్తున్నామని, తీసుకున్న డబ్బును సకాలంలో చెల్లిస్తే బ్యాంకులు తిరిగి రుణాలు ఇస్తాయని సీఎం జగన్ చెప్పారు.
