సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మైత్రి మూవీస్ అధినేతలు చేసిన విజ్ఞప్తి ని జగన్ సర్కార్ మన్నించింది. సంక్రాంతి సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు 10 రోజుల పాటు టికెట్‌ ధరలు స్వల్ప పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలు పోటీకి దిగుతుండటంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం మంచి పామ్ లో ఉన్న బాలకృష్ణ నటించిన వీరసిం హారెడ్డి రేపు గురువారం (ఈనెల 12న) విడుదల అవుతుం డగా, ఖైదీ నెంబర్ 150 తరువాత సరైన హిట్ లేని మెగాస్టార్ చిరంజీవి పక్క మాస్ గా నటించిన వాల్తేరు వీరయ్య 13న సంక్రాంతి బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మేకర్స్ కు తీపికబురు అందించింది. ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం .. వీరసింహారెడ్డి చిత్రానికి 20 రూపాయలు, వాల్తేరు వీరయ్య చిత్రానికి 25రూపాయలను స్వలాపంగా టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీనిపై జీఎస్టీ పెంపు అదనంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *