సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీమవరం పట్టం మరియు పరిసర ప్రాంత ప్రజలకు రాయల్ క్రాఫ్ట్ బజార్ అంటే చాల సుపరిచితమైన పేరు. గత దశాబ్ద కాలం పైగా ఎప్పుడు పండుగలా సీజన్ లోనైనా రాయల్ క్రాఫ్ట్ బజారు కోసం ప్రజలు ఎదురు చుస్తూఉంటారు. సామాన్యులు ధనవంతులు అన్న తేడా లేకుండా వారికి ఎంతో ఇష్టమైన, నమ్మకం కలిగిన అందుబాటు ధరలలో చేతి వృత్తి కళాకారుల తయారుచేసిన వస్త్ర వస్తు సామాగ్రిని అందించే ‘రాయల్ క్రాఫ్ట్ బజార్’ మరోసారి సరికొత్తగా స్థానిక నటరాజు థియేటర్ ప్రక్కన గ్రౌండ్ లో ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి ఎందరో చేతి వృతుల కళాకారులూ రూపొందించిన కాటన్, చేనేత, కలంకారీ రంగుల వస్త్రాలు, మహిళా శారీస్, ఆధునిక డిజెన్స్, పురుషుల రెడీమేడ్ దుస్తులు, దుప్పట్లు, సోఫా క్లోత్ లు, ఫాన్సీ ,మట్టిపాత్రలు, చెక్క వస్తువులు, ఇంటిని అలంకరించే కళాత్మక అలంకార వస్తువులు, పింగాణిలు, తివాచీలు, వెదురు ఫర్నిచర్, ఇంకా ఎన్నో రకాల వస్తువులు, వస్త్రాలు దాదాపు 50 స్టాల్స్ తో భారీ ఎత్తున ఏర్పాటు చెయ్యడం జరిగింది. హోమ్ మెడ్ తినుబండారాలుతో, పాటు భారీ చాట్ బండార్ లతో పాటు,కుటుంబసమేతంగా ఆస్వాదించవచ్చు.. ఎటువంటి ఎంట్రీ పీజు లేదు, వాహనాల పార్కింగ్ ఫీజు లేదు..ఎంతో కష్టపడే దేశీయ కళాకారుల టాలెంట్ ,నాణ్యతను వీక్షించడమే కాదు. వాటిని కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించడం..మన ధర్మం .. కాదంటారా?
