సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మిగనూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగవ విడుత జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా బటన్ నొక్కి రూ.325.02 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమా చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. నేను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు బటన్ నొక్కి డబ్బులు లబ్దిదారులకు ఇస్తున్న కూడా అప్పులు పెరగలేదన్నారు. గతంలో అయితే చంద్రబాబు ఆధ్వర్యంలో దత్త పుత్రుడు మద్దతుతో వేరే రాష్ట్రంలో నివాసం ఉండి ఇక్కడ కు వచ్చి పాలన చేసిన గజ దొంగల ముఠా ప్రజల సొమ్ములను దోచుకొనేది. ఇప్పుడు నా హయాంలో అవినీతి లేకుండా నేరుగా ప్రజలకే ఇస్తున్నాను.. అప్పుడు అప్పులు ఎక్కువ .. ఇప్పుడు అప్పులు తక్కువ.. ఆఖరికి కుప్పంలో కూడా చంద్రబాబు తమవాడు అనే చెప్పుకునే పరిస్థితి లేదన్నారు. మన ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో 20వేల ఇంటి స్థలాలు ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు రైతుల సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారని.. రాజధాని భూములు, స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ గ్రిడ్, మద్యంలో చంద్రబాబు స్కాములు చేసి దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పేదలకు ఒక సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. జాబు కావాలి అంటే బాబు రావాలి అని గత ఎన్నికల్లో ప్రచారం చేశారని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసారని సీఎం జగన్ ఎద్దేవా చేసారు.
