సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకనాటి ఇరాక్ నియంత.. సద్దాం హుసేన్ వెన్నుచూపని సాహసంతో పాటు విలాస జీవితం గడిపాడు, ఒకసారి కువైట్ ను ఆక్రమించించాడని, మరోసారి ఇరాక్ లో ప్రమాదకర రసాయన బాంబులు ఉన్నాయని ప్రపంచాన్ని నమ్మించి తప్పుదారి పట్టించింది. అమెరికా. అయితే ఎడారి ప్రాంతంలో సింహం లాంటి ఇరాక్ ను ఎదిరించలేని అమెరికా యూరప్ దేశాలను, ఇస్లామిక్ దేశాలను కలుపుకొని ఇరాక్ (అడ్జక్షుడు సద్దాం హుసేన్) ఫై 2 సారులు ఏళ్ల తరబడి యుద్ధం చేసి ఎట్టకేలకు కుట్రతో అతనిని బందీ చేసి ఉరి తీసిన చరిత్ర అందరికి తెలిసిందే.. దేశాలు అన్ని కట్టగట్టి యుద్దానికి వచ్చినా సద్దాం హుసేన్ తగ్గేదే లే.. అంటూ ఒంటరి దేశంగా పోరాడిన వైనం ఎవరు మరచిపోలేదు. ఈ ఉపోద్ఘాతం ఎందుకు అంటే.. తాజాగా వైసీసీ నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ను మంత్రి లోకేష్, సద్దాం హుస్సేన్ తో పోల్చారు. నేడు, మంత్రి లోకేష్ మీడియా తో మాట్లాడుతూ.. జగన్ తాను ఏపీ సద్దాం హుస్సేన్ గా ఊహించుకున్నారు.. 30 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతానని కలలు కన్నారంటూ ఎద్దేవా చేశారు.‘విశాఖ లోని ఋషి కొండపై నిర్మించిన భవనం.. తొలుత ఇది ఏపీ ప్రభుత్వ పర్యాటక శాఖ ప్రాజెక్ట్.. తర్వాత అది శిశ్ మహల్ గా మారింది అన్నారు.. లోకేష్ మాట్లాడుతూ.. ‘మా తాత NTR , నాన్న ఇద్దరు ముఖ్యమంత్రులగా పని చేశారు. కానీ వారి హయాంలో నేను ఇంత విలాసవంతమైన భవనాన్ని, ఇంత పెద్ద గదులను చూడలేదు. శిశ్ మహల్ నిర్మాణం కారణంగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ రాష్ట్ర ప్రభుత్వం మీద 200 కోట్ల రూపాయల జరిమానా విధించింది’ అని అన్నారు. అయితే వైసీపీ అధ్యక్షుడిది చాలా చిన్న కుటుంబం. ఆయన తల్లి, సోదరిలను కుటుంబం నుంచి పంపించి వేశారు. ప్రస్తుతం ఆయన, భార్య, పిల్లలు మాత్రమే ఉన్నారు. కేవలం నలుగురు కుటుంబ సభ్యుల కోసం 700 కోట్ల రూపాయల ఖర్చు చేశారు.( గతంలో 450 కోట్లు అన్నారు) ఆఖరికి ప్రధాన మంత్రి కూడా ఇంత పెద్ద ఇంట్లో నివాసం ఉండరు’ అని ప్రస్తుతం ఈ భవంతిని ఎలా వినియోగించాలి అని ఆలోచిస్తున్నామని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *