సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ లో నేడు, గురువారం డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు సమావేశం నిర్వహిస్తుండగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం మన భీమవరం పట్టణం ప్రధమ స్థానంలో ఉన్నప్పటికీ, జనం రద్దీ పెరగటంతో ఇక్కడ ప్రధాన సమస్య ట్రాఫిక్ అని, ఆ సమస్య తీరాలంటే మాస్టర్ రింగ్ రోడ్డు తప్పనిసరి అని , దానిని రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిదని అన్నారు. గతంలోనే భీమవరంలోని యనమదుర్రు డ్రేయిన్ పై మూడు బ్రిడ్జీలు నిర్మించామని,అయితే అవి చాల ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్నాయని, అయితే వాటికీ అప్రోచ్ రోడ్లు లేవని, ఆ అప్రోచ్ రోడ్డులు నిర్మాణం కూడా పూర్తీ చేస్తే కిలో మీటర్లు మేర ప్రయాణం చేసి ప్రజలు ప్రధాన సెంటర్ కు వచ్చే బాధలు తప్పుతాయని, ఎమ్మెల్యే అంజిబాబు పేర్కొన్నారు.. స్పీకర్ స్థానంలో రఘురామా కృష్ణంరాజు భీమవరం సమస్యలను సంబంధిత మంత్రి పరిశీలించి త్వరితంగా . పరిష్కారించాలని కోరారు
