సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు ను జైలుకు తరలించిన దరిమిలా ఢిల్లీ వెళ్లిపోయిన ఆయన కుమారుడు లోకేష్ ఫై కూడా పలు కేసులు నమోదు కావడం ఏ క్షణమైనా లోకేష్‌ను అరెస్ట్ చేస్తారని వార్తలు రావడం, పార్టీ క్యాడర్ ను వదిలేసి గత 3వారలు పైగా ఢిల్లీలో తప్పించుకుని తిరుగుతున్నాడని, బాగా భయపడుతున్నారని..వార్తలు రావడం జరిగాయి. ఆఖరికి ఢిల్లీలో ఉండగానే సీఐడీ నోటీసులు ఇవ్వడం.. అక్టోబర్-10న (సోమవారం నాడు) విచారణకు ఇవ్వాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఇంతలో సీఎం జగన్ 2 రోజుల పర్యటనకు గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ బయలు దేరగానే నారా లోకేష్ ఏపీకి రావడం గన్నవరం విమానాశ్రయంలో దిగటం జరిగింది. తదుపరి రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. సుమారు 45 నిమిషాలపాటు జరిగిన ఈ ములాఖత్‌లో పలు విషయాలపై లోకేష్‌కు బాబు దిశానిర్దేశం చేసినట్లు తెలియవచ్చింది. అయితే ఢిల్లీలో 2రోజుల పర్యటన ముగించుకొని నేడు, శనివారం సీఎం జగన్ ఏపీకి వస్తున్నా నేపథ్యంలో నారాలోకేష్ రెండోసారి ఢిల్లీకి బయల్దేరుతున్నారు. నేటి శనివారం మధ్యాహ్నం రాజమండ్రి నుంచి ఢిల్లీకి లోకేష్ పయనమవుతున్నారు. ఇది టీడీపీ శ్రేణులకు కొంత నిరాశ కలిగిస్తున్న.. చంద్రబాబు ను విడుదల చేయించే ప్యూహంలో భాగం అనుకొంటున్నారు. అయితే లోకేష్ పదో తారీఖున నేరుగా విజయవాడలోని సీఐడీ ఎదుట విచారణకు హాజరవుతారని తెలుస్తోంది.
