సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు నెంబర్ 2 న్యాయమూర్తి, భవిష్యత్తులో కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా స్పష్టంగా ఆదేశించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశాలతోనైనా హైదరాబాద్ సిబిఐ కోర్టు వారు జగన్మోహన్ రెడ్డి ని విచారణకు పిలుస్తారా?అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నేనని పేర్కొన్నారు. నాకు ఏ పార్టీ మద్దతు లేదు. నేను చేస్తున్నది ఒంటరి పోరాటం. ఈపాటికి ప్రజలకు ఈ విషయం అర్థమై ఉంటుంది. నేను ఏ పార్టీ సభ్యుడిని కాను. సభ్యుడు కానివారికి ఏ పార్టీ కూడా మద్దతు ఇవ్వదని అంటున్నారు. సీఎం జగన్ తో విరోధం పెంచుకొన్నది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే.. నిజానికి జగన్ తో గొడవ లేకుండా నా పదవీకాలాన్ని ఐదేళ్లు పాటు హాయిగా అనుభవించవచ్చు. నిజంగా ఎవరైనా అనుభవించాలని చూస్తారు. నిన్న మొన్న టిడిపిలో, కొంతమంది బిజెపిలో చేరారు. వారు చేసిన పోరాటం సంగతి దేవుడెరుగు, జగన్ ఫై పెదవి విప్పి మాట్లాడినట్టుగా చూపెడితే నేను కూటమి సీటు అడగనని రఘురామకృష్ణం రాజు సవాల్ చేశారు. ఈ పది రోజుల వ్యవధిలోటీడీపీ , బిజెపిలో చేరిన వారు ఒక్కరైనా జగన్మోహన్ రెడ్డిని గతంలో ప్రశ్నించారంటే నేను రాజకీయాలనుంచి శాశ్వతంగా విరమించుకుంటానని సవాల్ చేసారు, . అంతమందికి సీట్లు ఇచ్చిన కూటమి పార్టీలు బిజెపి, జనసేన, టిడిపి ఎవరైనా కావచ్చు.. ప్రజల కోసం పోరాడి, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించిన నన్ను విస్మరిస్తారని నేను అనుకోవడం లేదని రఘురామ తన ఆవేదన వ్యక్తం చేసారు.
