సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో గత జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ ఆరోపిస్తూ ముఖ్య మంత్రి నారా చం ద్రబాబు. లిక్క ర్ స్కామ్ పై సంచలన నిర్ణయం తీసుకున్నారు..వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు..నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈడీకి రిఫర్ చేస్తామని స్ప ష్టం చేశారు. ఐదేళ్లల్లో లక్ష కోట్ల నగదు అమ్మ కాలు జరిగాయి.. ఇది భయం కరమైన స్కామ్‌గా అభివర్ణించారు..ఇక, మద్యం కుంభకోణాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. నేరస్తుడే సీఎం అయితే వ్యవస్థలు ఎలా ఉం టాయో? గత ఐదేళ్లల్లో చూశామన్నారు. ఆయన.. మద్య నిషేధం అని హామీ ఇచ్చా రు.. కానీ ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టారు. మద్యం పాలసీలో అడుగడుగునా తప్పు లు చేశారు. గత ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది. మైండ్ ఉండే ఎవ్వడూ ఈ తరహాలో ఎక్సైజ్ పాలసీ రూపొందించరంటూ ఆగ్రహం వ్య క్తం చేశారు.. లక్ష కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగితే.. కేవలం రూ. 630 కోట్లు మాత్రమే డిజిటల్ అమ్మకాలు జరిగాయన్నారు సీఎం చంద్రబాబు..
