సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: ఏపీ సీఎం జగన్ గత 4 ఏళ్ళ క్రితం అధికారంలోకి రాగానే సుమారు 50 వేల మంది ప్రభుత్వ ఆర్టీసీ బస్సు కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యొగులుగా మార్చేసిన ఘటన చరితాత్మకం.. మరి తెలంగాణలో కూడా అప్పటి నుండి కెసిఆర్ ప్రభుత్వం ఫై తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఒత్తిడి తెచ్చి దారుణంగా భంగపడిన విషాద ఘట్టం అందరికి తెలిసిందే.. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళా కెసిఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం . తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకోవాలన్న ఉద్దేశంతో వారిని ప్రభుత్వంలోకి విలీనం చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. గత సోమవారం క్యాబినెట్ సమావేశం ఐదుగంటల పాటు జరగగా.. అందులో రెండున్నర గంటలపాటు ఆర్టీసీ అంశంపైనే చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్టీసీ సిబ్బంది అంతా ఇకపై ప్రభుత్వ ఉద్యోగులేనని ప్రకటించారు.
