సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో సీఎం జగన్ బహిరంగ సభలో జనసేన పార్టీని ఉద్దేశించి” రౌడీ సేన” అని విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సీఎం వ్యాఖ్యలపై తీవ్ర అభ్యన్తరం వ్యక్తం చేసారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని అసహనం,ఆందోళనకు కారణం అన్నారు. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతున్న జనసేన అధ్య క్షుడు పవన్ కళ్యాణ్ , జనసైనికులను,వీర మహిళలును సీఎం జగన్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రాష్ట్రం లో రోడ్ల దుస్థితిని తెలిపినందుకా? మత్స్య కారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా?మీరు రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకు జనసేన రౌడీసేన అవుతుందా? అంటూ ట్విటర్ వేదికగా మనోహర్ పలు ప్రశ్నలు సంధించారు.
