సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: డిసెంబర్ 7వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జరగనున్న “జయహో బీసీ మహాసభ” కార్యక్రమానికి భీమవరం నుంచి బీసీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జయహో బీసీ మహాసభ పోస్టర్ ను క్యాంపు కార్యాలయంలో భీమవరం బిసి నేతల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. గత 3న్నర ఏళ్లుగా బిసిల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేస్తున్న నిత్య శ్రామికుడు మన జగనన్న అని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఓట్ల బ్యాంకు గా మాత్రమే ఉంటూ చంద్రబాబు చేతిలో ఎన్నోసారులు మోసపోయి, అవమానాలు పాలయిన బిసి ల అభివృద్ధి కి సీఎం జగన్ తన 3న్నర ఏళ్ల కాలంలో చేప్పట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను, రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కీలక పదవులలో బిసిలకు, మహిళలకు కేటాయింపులు బిసిల ప్రతి కులానికి కార్పొరేషన్లు డైరెక్టర్ పదవులు ఇచ్చి బిసి నేతలను గౌరవించిన ముఖ్యమంత్రి సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. కావున సీఎం జగన్ సమక్షంలో విజయవాడ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న “జయహో బీసీ మహాసభ” కార్యక్రమానికి బీసీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు
