సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జీ 7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కెనడా వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా తాజగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు జమ్మూ కశ్మీర్ అంశంపై గత మంగళవారం రాత్రి ఫోన్ ద్వారా ప్రధాని మోదీ స్పష్టం చేసారు. జమ్మూ కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌తో జరిపే చర్చల్లో మూడో పక్షం మధ్యవర్తిత్వం అవసరం లేదని.. అలా జరగాలని తాము కోరుకోవడం లేదని భారత్ కుండ బద్దలు కొట్టారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ నేడు, బుధవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. ప్రధాని మోడీ ట్రంప్ తో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలోఆపరేషన్ సిందూర్ దెబ్బకు దిగివచ్చిన పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తొలుత తెరపైకి తీసుకు వచ్చిందని గుర్తు చేసారు. ఆ క్రమంలో జమ్మూ కశ్మీర్ విషయంలో మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని ట్రంప్‌కు మోదీ స్పష్టం చేశారన్నారు.
