సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో నేడు, శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప బి ఆర్ ఎస్ అభ్యర్థి ఫై 25 వేలు ఫై చిలుకు ఓట్ల మెజారిటీ తో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ప్యూహం పాలించింది. గతంలో కూడా హైదరాబాద్ లో కంటొన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత దుర్మారణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ గెలవడం జరిగింది. హైదరాబాద్ మహా నగరంలో కాంగ్రెస్ పార్టీ కి ఉప ఎన్నికలలో 2 స్థానాలు గెలవడం మంచి జోష్ పెంచింది. ఇదే జోష్ తో ఇక తెలంగాణాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుంది. ఈ విజయం సాధించిన కిక్‌తో ఆ రెండు ఎన్నికలకు సిద్ధమవుతోంది.
