సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల రోజుకో రోడ్డు ప్రమాదాలు బస్సు ప్రమాదాలు రివాజుగా మారిన నేపథ్యంలో.. ఏలూరు జిల్లా వ్యాప్తంగా గత శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా మోటారు వాహనాల తనిఖీ అధికారులు ప్రవేటు విద్యా సంస్థల బస్సులను తనిఖీలు నిర్వహించి వాటిలో ఫిట్నెస్ లేని 36 బస్సులపై కేసులు నమోదు చేసి ఐదు లక్షల 14 వేల 400 రూపాయల అపరాధ రుసుము విధించినట్లు డీటీసీ షేక్ కరీమ్ ప్రకటించారు. వాహనాల టైర్లు, బ్రేకులు, హెడ్‌లైట్లు, ఎప్పటి కప్పుడు తనిఖీ చేయించాలన్నారు. జిల్లాలో విద్యా సంస్థల బస్సులు ఫిట్‌నెస్ లేకుండా నడపరాదని, విద్యార్థుల రక్షణ పరిగణలోకి తీసుకోవాలని, డ్రైవింగ్ లైసెన్సు లేని వ్యక్తులు స్కూలు బస్సులు నడపరాదని అన్నారు. విద్యార్థులను తరలించే విష యంలో నిబంధనలు పాటించని విద్యా సంస్థల బస్సులను, ప్రైవేటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
