సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ ఉత్తీర్ణులయిన విద్యార్థులు మరింత ఫై స్థాయిలో ఐఐటీల్లో బీటెక్ చేయడానికి జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసిన వారికి ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. ఐఐటీ మద్రాస్ జేఈఈ పరీక్షా ఫలితాలను నేడు, ఆదివారం విడుదల చేసింది. ప్రతీ ఏడు ఐఐటీల్లో ఇంజనీరింగ్ చేయడానికి జేఈఈ అడ్వాన్స్ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి లక్షల్లో విద్యార్ధులు హాజరవుతారు. ఈ ఏడాది కూడా దాదాపు రెండు లక్షల మంది జేఈఈ ఎగ్జామ్ రాశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేలమంది పాల్గొన్నారని అంచనా..
