సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత సాయంత్రం అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ ఆన్ లైన్ లో హైకోర్డు ఆర్డర్ కాపీ వెంటనే చెయ్యకపోవడం తదుపరి రాత్రి 10 గంటల తరువాత కాపీ రావడం, అల్లు అరవింద్ అధికారుల తీరుతో ఆవేశం గా వచ్చిన కారు వదిలేసి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లిపోవడం తదితర నాటకీయ పరిణామాల నేపథ్యంలో నేటి శనివారం ఉదయం 6న్నర గంటలకు అల్లు అర్జున్ జైలు నుండి విడుదల అయ్యి ముందుగా అల్లు ఆర్ట్స్ ఆఫీస్ కువెళ్లి తదుపరి నివాసానికి చేరుకొన్నారు. అల్లు అర్జున్‌కు సంఘీభావం తెలిపేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఇంటికి ఎవరెవరు వచ్చారంటే.. చిరంజీవి సతీమణి సురేఖ, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, కె. రాఘవేంద్రరావు, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ సోదరులు, ఆర్. నారాయణమూర్తి, దర్శకుడు సుకుమార్, హరీష్ శంకర్, బివిఎస్ రవి, సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ మరియు రవిశంకర్, కొరటాల శివ, దిల్ రాజు, వంశీ పైడిపల్లి,అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. తనకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన సినీ ప్రముఖులను అల్లు అర్జున్ కూర్చోబెట్టి కాసేపు ముచ్చటించారు. సోషల్ మీడియా వేదికగా మాజీ సీఎం జగన్, ఉండి ఎమ్మెల్యే రఘురామా , సినీ నటులు నాని, రష్మిక మందన్నా, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ వంటి వారంతా బన్నీ అరెస్ట్‌ను ఖండిస్తూ ట్వీట్స్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *