సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరపదేశ్ లోని వారణాసి సమీపంలో గతంలో పురాతన శివాలయం ఉన్న స్థానంలో మొగలాయి చక్రవర్తుల కాలంలో ఆలయ నిర్మాణాలయాల ఫై జ్ఞాన వాపి మసీదు ను నిర్మించారని ఆధారాలు నిరూపితం కావడంతో.. తాజగా ..నేడు, సోమవారం అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రకటించింది… దానిలో జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చని ఇటీవల వారణాసి సెషన్స్ జడ్జి అనుమతిచ్చారు. దానిని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ రంజన్ కూడా అదే తీర్పును సమర్ధించారు.
