సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేనకు కేవలం 24 సీట్లు కేటాయింపుపై చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ ఫై గోదావరి జిల్లాలోని కాపు నేతలు కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. పాలకొల్లు కు చెందిన మాజీ మంత్రి , మాజీ ఎంపీ ,కాపు నేత హరిరామజోగయ్య సీరియస్ కామెంట్స్ చేస్తూ నేడు, ఆదివారం పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ విడుదల చేసారు. దానిలో . టీడీపీ-జనసేన పొత్తులో భాగం గా 24 సీట్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. జనసేన పరిస్థితి మరి ఇంత హీనం గా ఉందా? అని అన్నారు.పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. ఒకరు ఇవ్వడం .. మరొకరు దేహీ అని పుచ్చు కోవడం పొత్తు ధర్మం అనిపించుకోదు. నిజానికి జనసైనికులకు కావల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు. పవన్ పరిపాలన అధికారం చేపట్టడం . పొత్తు ధర్మంలో భాగంగా పవన్ రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి. చెరిసగం మంత్రి పదవులు దక్కాలి. ఇవ్వన్నీ చంద్రబాబు నాయుడే ప్రకటించాలి అని డిమాండ్ చేశారు.. హరిరామ జోగయ్య ..
