సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంగళగిలో జనసేన పార్టీ విస్తృ తస్థాయి సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్యాడర్ తో మాట్లాడుతూ.. సీఎం జగన్ ను అధికారం నుండి దించి వైసిపి నేతల ప్రజా వ్యతిరేక పాలన ను తరిమికొట్టడానికి తెలుగుదేశంతో పొత్తు కట్టానని దాన్ని క్యాడర్ అర్ధం చేసుకోవాలని, ఇకపై జనసేన, తెలుగుదేశం పొత్తుపై వ్యతిరేకంగా ఏ స్థాయి జనసేన నాయకులు మాట్లాడినా, చిన్న, పెద్ద కార్యకర్తలు మాట్లాడిన, టీడీపీవారితో గొడవలకు దిగిన ఊరుకునేది లేదు. అలాంటివారిని వైసిపి కోవర్టులుగా భావిస్తాం .పార్టీ పరంగా గట్టి చర్యలు తీసుకుంటాం. నన్ను ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకుంటారు. నేను పెంచి అండగా ఉన్న నాయకులు నన్ను ఎందుకు అర్థం చేసుకోరు. అసలు లోపం ఎక్కడుంది ? అని పార్టీ క్యాడర్ ను ప్రశ్నించారు. ఈ పొత్తు నిర్ణయం నచ్చనివాళ్లు ఇంకా ఎవరైనా ఉంటే..అనవసర సలహాలు.. సోషల్ మీడియాలో తనఫై వ్యతిరేక పోస్టులు పెట్టకుండా వైసిపి లోకి వెళ్లిపోవచ్చు ’ అని జనసేన అధ్య క్షులు పవన్ కల్యాణ్ హెచ్చరించారు
