సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొద్దీ రోజుల క్రితం గన్నవరం లోకేశ్ బహిరంగసభలో గన్నవరం నారా లోకేశ్ బహిరంగసభలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు తనదయిన తీరుతో తీవ్ర పదజాలం తో సీఎం జగన్ ను విమర్శించి నందుకు మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపై కేసు నమోదు అయ్యింది . ఈ నేపథ్యంలో అయ్యన్నను నేడు, శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అయన నేడు ఢిల్లీ నుంచి విశాఖపట్నం రాగ ఆయన కోసం వేచి ఉన్న ఎయిర్‌పోర్టులోని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి పోలీసులు అయ్యన్నకు 41(ఏ) నోటీసు ఇచ్చి అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం ఎలమంచిలి మధ్య హైవేపై ఆయనను విడిచిపెట్టారు. అయ్యన్నను అరెస్ట్ చేశారన్న సమాచారంతో నక్కపల్లి ప్రాంతంలో టీడీపీ శ్రేణులు మోహరించారు. ముఖ్యనేతలతో కలసి అయ్యన్న అక్కడే హోటల్ కు వెళ్లి భోజనం చేసారు. దీనిపైఅయ్యన్న కు చంద్రబాబు ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకొన్నారు.
