సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ లేకుండా తెలంగాణ ఎన్నికలను ఊహించలేం.. అయితే రాష్ట్ర విభజన తరువాత రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికినప్పటి నుండి తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ బలహీనపడుతూ వచ్చింది. తదుపరి అపట్లో , జి హెచ్ ఎం సి ఎన్నికలలో కేవలం ఒక్క కార్పొరేషన్ మాత్రమే గెలిచి స్థాయికి వచ్చెయ్యడం తో తెలంగాణ పార్టీ రాజకీయాలు వదిలేసి నారా లోకేష్ పూర్తిగా ఆంధ్ర ఫై ఫోకస్ పెట్టారు. ఇక చేసేది లేక కీలక నేతలు ఎవరిదారి వారు చూసుకొన్నారు. నిజానికి ఇప్పటికి గ్రామా గ్రామాన ఉన్న ప్రతిష్ఠమైన క్యాడర్ మాత్రం అలానే ఉంది. వారందరిని కలుపుకొని ఏకం చేసే పనిలో ఇటీవల టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్య క్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కొంతమేర ప్రభావం చూపిస్తున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికలలో బీజేపీ తో పాటు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార బిఆర్ ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే దిశగా హోరాహోరీ పోరుకు సిద్ధం అవుతున్న వేళా .. టీడీపీ ఓట్లు కూడా కాంగ్రెస్ కు పడాలనే ప్యూహం కావచ్చు.. అకస్మాత్తుగా టీడీపీ ఎన్నికలలో పోటీచేయడానికి చంద్రబాబు ఆమోదం తెలపలేదు.. ఈ నేపథ్యంలో నేడు, ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో కాసాని జ్ఞానేశ్వ ర్ తో టీడీపీ క్యాడర్ సమావేశం అయ్యా రు. తనెంతగా చెప్పిన ఎన్నికల్లో పోటీకి అధిష్ఠానం నిరాకరించినట్టు శ్రేణులకు తెలిపారు. దీంతో ఎన్నికల్లో పోటీ వద్దన్న పార్టీ నిర్ణయం పై టీడీపీ నేతలు నిరసన వ్య క్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టారు.ఈ క్రమం లో కాసాని జ్ఞానేశ్వ ర్ భావోద్వే గానికి గురయ్యారు, కనీళ్ళు పెట్టారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *