సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అనేక సార్లు వాయిదా పడినప్పటికీ ఎట్టకేలకు ఏలూరు కు చెందిన మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని నేడు, శుక్రవారం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో చేరిపోయారు, తెలుగుదేశం పార్టీలో చేరికపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ (చంటి) శుక్రవారం ఏలూరులో స్పందించారు. ఆళ్ల నాని పార్టీలో చేరడం.. అధిష్టానం నిర్ణయమని తెలిపారు. ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలోకి రావడం ఏలూరులోని స్థానిక కేడర్‌కు ఇష్టం లేకపోయినప్పటికీ.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని, టీడీపీ మహా సముద్రం అని వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు.. పోయేవాళ్లు పోతూ ఉంటారు అని అన్నారు. ఆళ్ల నాని పార్టీలో చేరికపై తమ కార్యకర్తలకు నచ్చ చెప్పామన్నారు. అయితే ఏలూరు టీడీపీ నేతలు అయితే మాజీ ఎమెల్య నాని ని ఎలా కలుపుకొనివెళ్ళాలి అని , వైసీపీ లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ ప్రసిడెంట్ , ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రి వంటి అనేక ప్రతిష్టాత్మక పదవులు అనుభవించి ఆ పార్టీ పరాజయం పొందిందని, అధికారం కోసం వదిలేస్తున్నాడంటే గతంలో ప్రజలకు చేసిన మేళ్లు లేవని మరి, అటువంటి నేత టీడీపీ కి ఎలా మేలు చేస్తాడని ప్రశ్నిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *