సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నంద్యాలలో ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ప్యాక్షన్ ముద్ర ఉన్న ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు, బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిం ఆయన.. సీనియర్లతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. నంద్యాల ఘర్షణ ఘటనపై సమగ్ర అధ్యయనంతో నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లం ఘిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. గత మంగళవారం రాత్రి నంద్యాల నియోజకవర్గం లోనికి నారా లోకేశ్ పాదయాత్ర ప్రవేశించిన నేపథ్యం లో కొత్తపల్లి వద్ద మాజీ మంత్రి భూమా అఖిలప్రియ,ఆమె బంధువు, టీడీపీ సీనియర్ నేత ఎ.వి.సుబ్బా రెడ్డి వర్గాలు పోటాపోటీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఎ.వి.సుబ్బా రెడ్డిని అఖిలప్రియ వర్గీయుడు కొట్టడం .. ఆయన ముక్కు నుంచి రక్తం కారడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్క డే ఉన్న, పోలీసు అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పడం తో వివాదం సద్దుమణిగింది. అయితే నేడు, బుధవారం ఉదయం దాడికి ప్రేరేపించిన కేసులో అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసి పాణ్యం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు టీడీపీ వర్గాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *