సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ సిటీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గత 6రోజులుగా రోజులుగా జరుగుతున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నేటి బుధవారం తో ముగిసింది. మహాయజ్ఞం ముగింపులో భాగంగా ఈరోజు అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాంప్రదాయ పద్దతిలో పట్టు వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. సీఎం జగన్ కు ఆధ్యాత్మిక గురువుగా మొదటి నుండి మార్గనిర్దేశ్యం చేస్తున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. అవదూత గణపతి సచ్చిదానంద స్వామి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వేద పాంచరాత్ర యాగశాలలో పూర్ణాహుతికి వెళ్తూ మార్గ మధ్యలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పాదాలను జగన్ మ్రొక్కి ఆసిర్వచనం తీసుకొన్నారు. సీఎం వెంట వచ్చిన భద్రతా సిబ్బంది అంతా యాగశాలలోకి నీలం రంగు పంచెలతో ప్రవేశించారు. నేటి మధ్యాహ్నం నుండి వేలాది మంది భక్తులకు మహా ప్రసాద అన్న సమారాధన టీటీడీ చైర్మెన్ వై వి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కాగా… ఏపీ అభివృద్ధి చెందాలని కోరుతూ ఈనెల 12 నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ను సీఎం జగన్ ప్రారంభించిన విషయం అందరికి విదితమే..
