సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల్లూరు లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేడు, ఆదివారం కీలక వ్యా ఖ్య లు చేశారు. చట్టసభల్లో ఎక్కడా జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదన్నా రు. పవన్ కళ్యాణ్ ఎలాగోలా కేవలం చట్ట సభల్లోకి రావడానికే టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారని ఆయనవిమర్శలు గుప్పించారు. వాళ్ళ పచ్చమీడియా హడావిడి తప్ప నిజానికి ఈ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఆరు అసెంబ్లీస్థానాలు మాత్రమే వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కనివిని ఎరుగని రీతిలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్య క్తం చేశారు. ప్రజాబలం లేకపోవడంతో కొందరు టీడీపీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారన్నారు. నెల్లూరు లోక్‌సభ స్థానం జనరల్ కేటగిరికి కేటాయించారని.. సొంత ప్రాంతం నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నా రు. తమకు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నరని తీవ్రంగా మండిపడ్డారు. నిజానికి ఇక్కడ టీడీపీ కి అభ్యర్థులు కరువయ్యారని అందుకే వైసీపీ లో సీట్లు దొరక్క వెళ్ళిపోయినవారినే నెల్లూరు జిల్లా అంతటా నిలబెడుతున్నారని, ఇంకా దివాళాకోరుతనం సాగిస్తుందని విమర్శించారు. మా పార్టీ ద్వారా అన్నీ పొందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి, ఇతర నేతలు నైతిక విలువలు పక్కన పెట్టి మాట్లాడుతున్నారన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. విశాఖ పోర్ట్‌కు మాదక ద్రవ్యాలు కలిగిన కంటైనర్ , సంధ్య ఆక్వా కంపెనీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిదేనని తెలుగు రాష్ట్రాలలో అందరికి తెలిసినదేనని ఆయన ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరుగుతోందన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *