సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం డాక్టర్ బి.వీ.రాజు ఫౌండేషన్ మరియు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు ఇటీవల హైదరాబాద్లో జరిగిన ‘టై గ్రేడ్ బిజినెస్ ఇండియా – 2024 టోర్నమెంట్’ లో మొదటి బహుమతిని సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేణు తెలిపారు., ఈ పోటీలో 112 ప్రముఖ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారని, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రీన్ ఫ్యూషన్ ఐ.ఓ.టీ. సొల్యూషన్స్ టీమ్ మొదటి బహుమతి సాధించడం గర్వకారణమని చెప్పారు. గెలుపొందిన టీమ్కు 1లక్ష రూపాయల నగదు బహుమతి అందించడంతో పాటు అమెరికాలో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించబడిందని వివరించారు. ప్రముఖ బహుళజాతి ఇన్వెస్టర్లు కూడా మా కళాశాల టీమ్ను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నారని, విజేతలను మరియు ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మరియు మెంటార్ డాక్టర్ వీ.ఎస్.ఎన్. నరసింహరాజు ను అభినందించారు. .ఈ విజయానందాన్ని పురస్కరించుకుని సొసైటీ చైర్మన్ విష్ణు రాజు , వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్ , సెక్రటరీ ఆదిత్య విస్సం , డైరెక్టర్ప్ ప్ర సాద్ రాజు ,అధ్యాపకులు, మరియు అధ్యాపకేతర సిబ్బంది విజేతలను అభినందించారు .
