సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంచి టాక్ వచ్చినప్పటికీ కెమెరా ప్రింట్స్ విచ్చల విడిగా రావడంతో అనుకున్నంత భారీ కలెక్షన్స్ రాబట్టలేకేపోయినప్పటికీ ‘కన్నప్ప’ ఇప్పటికే 50 కోట్ల రూపాయలు వసూళ్లతో పాటు మరో 40 కోట్ల వరకు అన్ని బాషలలోను ఓటిటి , శాటిలైట్ రైట్స్ వరకు అదనపు ఆదాయంన్ని సాధించే దిశగా అడుగులు వేస్తుండటంతో హీరో మంచు విష్ణూ, నిర్మాత నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu) ప్రస్తుతం ఎంతో సంతోషంలో ఉన్న విషయం తెల్సిందే. ప్రభాస్ (Prabhas) రుద్రగా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర వహించాడు. కన్నప్ప రిలీజ్ కు ముందు పిల్లలకు యూ ట్యూబు లో క్యామియోలు కూడా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. అయితే సినిమా బావున్నా కూడా కొంతవరకు ట్రోలింగ్ కూడా నడిచింది. కన్నప్ప అట్టర్ ప్లాప్ అని, ఇక మంచు కుటుంబానికి అసలు సినిమాలు వేస్ట్ అని రకరకాలుగా ట్రోల్ చేశారు. ఈ ట్రొల్స్ ఫై మంచు మోహన్ బాబు తాజగా స్వాందిస్తూ .. విమర్శ – సద్విమర్శ.. ప్రకృతి – వికృతిలా రెండు ఉంటాయి. మీరేమైనా ఇంతకు ముందు జన్మలో కానీ, ఈ జన్మలో కానీ తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే .. మా పాప కర్మనంతా వాళ్లు( ట్రోల్స్ చేస్తున్నవారు) తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్లను ఆశీర్వదించండి అన్నాడు. అందుకే నేను వాళ్ల గురించి నేనేం మాట్లాడను. వాళ్లు బావుండాలి. వాళ్ల అమ్మానాన్నలు బావుండాలి అని కోరుకుంటాను’ అని వ్యాఖ్యానించడం నెట్టింట వైరల్ గా మారాయి.
