సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి లో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో (World Population Day) సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఏపీలో తాను గతంలో ఇద్దరు పిల్లల కంటే.. ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదనే చట్టం తెచ్చానని గుర్తుచేశారు. కానీ ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటె వారికే గౌరవం అనే రోజులు వచ్చాయని .. అందుకే ఈరోజు తానే జనాభా పెరుగుదలను సమర్థిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారని .. ప్రపంచంలో అత్యధికంగా మన దేశంలో సుమారు 143 కోట్లమంది ఉండగా.. చైనా జనాభా 130 కోట్ల కి పడిపోయిందన్నారు. ప్రపంచంలో చాల దేశాలలో పాపులేషన్ పడిపోతోందని పేర్కొన్నారు. అమెరికాలో ఫెర్టిలిటీ(సంతానోత్పత్తి) రేటు 1.62 మాత్రమేనని.. 2.1 ఫెర్టిలిటీ రేటు ఉంటే రీప్లేస్మెంట్ ఉంటుందన్నారు. అలాగే ఏపీలో అది 1.7కి పడిపోయిందన్నారు.రాబోయే రోజుల్లో ఉత్తరాదిన లోక్సభ సీట్లు పెరుగుతాయి. దక్షిణాదిలో జనాభా పెరగకపోవడంతో లోక్సభ సీట్లు తగ్గుతాయని అంటున్నారు. మనిషిని రీప్లేస్ చేసేది భవిష్యత్తులో కూడా ఏదీ రాదు. రాష్ట్రంలో జనాభా నిర్వహణ. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కోసం పాలసీలు తీసుకువస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
