సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినిమాల హీరోల అభిమానులు ఏమనుకున్నా సరే.. ఆంధ్ర ప్రదేశ్ లో ఆఖరికి పరభాషా సినిమాల డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్స్ రేట్లు పెంచి ప్రజల జేబులకు చిల్లు పెట్టె పరిస్థితి వచ్చేసింది. ఈ పరిణామాల వల్ల తాత్కాలికంగా కాస్త డబ్బులు ఎక్కువ రాబట్టుకోవచ్చు కానీ దీర్ఘకాలంలో ఉన్న కొద్దీ సినిమా థియేటర్స్ లో సినిమాలు చూసేవారు మరింత తగ్గిపోయి మొత్తం సినిమా థియేటర్స్ వ్యవస్థకు ముప్పు రానుంది. రేపు రిలీజ్ కానున్న 2 డబ్బింగ్ సినిమాల టికెట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేకించి వార్ 2, కూలి మూవీల టికెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. రేపు, వార్ 2 మూవీ రిలీజ్ రోజున ఉదయం 5 గంటల షోకు అనుమతినిచ్చింది. అయితే టికెట్ ధర రూ. 500గా నిర్ణయించింది. ఇక సినిమాల టికెట్ల ధరల విషయానికి వస్తే , రాప్తి రిలీజ్ నుంచి 10 రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 చొప్పున టికెట్ల ధరలను పెంచుకోవచ్చు. ప్రత్యేకించి అదనపు షోలకు కూడా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 14 నుంచి 23 వరకు సినిమా టికెట్ల పెంపుకు అనుమతినిచ్చింది.
