సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కల్యాణ్ నేడు, బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తనకు సచివాలయంలో కేటాయించిన క్యాబిన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలపై ఆయన సంతకం చేశారు. దీంతో డీప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలోకి ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అడుగు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు సందడి వాతావరణం నెలకొంది . భీమవరంలో అన్ని ప్రధాన సెంటర్లలో భారీ అభినందన ఫ్లెక్సీలు కట్టారు.
