సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి స్పెషల్‌గా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ డివైడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్‌పై కలెక్షన్ల తాండవం చేస్తోంది. త్రివిక్రమ్ సినిమా స్టైల్ లో లేకపోయిన సంక్రాంతి ప్రేక్షకులకు కావలసిన మాస్ మాసాలతో, హీరోగా మహేష్ బాబు గుంటూరు యాస లో కొత్తతరహా నటనతో మాత్రం మాస్ ప్రేక్షకులను కట్టిపడేసాడని రియల్ టాక్.. సినిమా విడుదలైన రోజు కావాలని కొందరు మరో అజ్ఞాత వాసి అంటూ నెగిటివ్ టాక్ ప్రచారం చేసినా.. ఆ ఎఫెక్ట్ కలెక్షన్లపై ఎక్కడా కనిపించలేదు. ‘గుంటూరు కారం’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 94 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి మహేష్ సినిమాలలో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టిన సినిమా గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఎలానూ పండుగ రోజులే కాబ్బటి ఈ వారం గుంటూరు కారం సినిమాకు తిరుగు ఉండదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *