సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన పార్టీకి తెలుగు దేశం పార్టీ తో పొత్తు కు ఎన్నో అడ్డంకులు ఏర్పడిన నేపథ్యంలో ఇక బీజేపీతోనైనా పొత్తు కొనసాగించాలా? లేక ఒంటరిగా బరిలోకి దిగాలా? అన్న మీమాంస ఎదురుకొంటున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఢిల్లీ పర్యటన నేడు, మంగళవారం కూడా కొనసాగుతోంది. గత సోమవారం హస్తినకు చేరుకున్న పవన్‌.. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, మురళీధరన్‌తో సమావేశం అయ్యారు, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గానూ ఉన్న మురళీధరన్‌తో పవన్‌ నేడు, మంగళవారం ఉదయం మరోసారి భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు వస్తే బీజేపీ , జనసేన పొత్తు ఫై ముందే స్వష్టత ఉంటె మంచిదని , సీట్ల పంపకం ఎలా ఉండబోతుంది?, భవిష్యత్‌ కార్యాచరణపై బీజేపీ ఉద్దేశాలు పవన్‌ చర్చిస్తున్నట్లు సమాచారం. జనసేనానితో పాటు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా చర్చల్లో పాల్గొన్నారు. నేటి సాయంత్రం కేంద్రహోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *