సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి 7 గంటల ప్రాంతంలో ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన ( Delhi Blast )తో కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ బాంబు బ్లాస్ట్ ఘటనలో ఇప్పటివరకు 9మంది మృతిచెందగా, మరో 23 మందికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్‌కు 15 మంది క్షతగాత్రులని తరలించినట్లు వివరించారు. ప్రస్తుతం ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. పేలుడు ధాటికి 10 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు ఐ20 కారు నిలిపి ఉంచారని వివరించారు. ఈ కారు నిన్న మధ్యాహ్నం 3:19 గంటలకు పార్కింగ్ స్థలంలోకి వచ్చినట్లు గుర్తించారు. ఐ20 కారు నిన్న సాయంత్రం 6:48 గంటలకు పార్కింగ్ స్థలం నుంచి బయలుదేరిందని తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే పేలుడు సంభవించిందని పేర్కొన్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు. నిజానికి నిన్న ఉదయమే 350 కేజీల పైగా ఆర్డీఎక్స్ ను, సుమారు500 కేజీల అమోనియం నైట్రేట్ గుళికలు జమ్మూ కాశ్మిర్, యూపీ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ లో ఒక డాక్టర్ ఇంట్లో స్వాధీనం చేసుకొన్నారు. అప్పుడే ఎదో భారీ బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు ప్యూహం పన్నారని అనుమానాలు వచ్చాయి. దీని వెనుక దేశంలో నలుగురు ఇస్లామిక్ డాక్టర్స్ ప్రమేయం? ఉందని ప్రాధమిక దర్యాప్తు లో అనుమానాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *