సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈ నెల 21న సీఎం జగన్ పర్యటించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావుతో కలసి పట్టణంలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. పోలీస్ యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇక సీఎం జగన్ పర్యటించే ప్రాంతాలలో వైసిపి నేతలు, అభిమానులు, జనం రద్దీ మరియు భద్రతా కారణాల వల్ల అధికారులు సూచన మేరకు ఆ రోజు మంగళవారం మధ్యాహ్నం 3గంటల వరకు షాపులు తెరవవద్దని తణుకు మర్చంట్స్ ఛాంబర్స్ ఆఫ్ సభ్యులకు సూచించారు.
