సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నేడు, శుక్రవారం ఒక వ్యక్తి హత్య పట్టణంలో సంచలనమ్ కలిగించింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే తణుకు లో సజ్జాపురం ప్రాంతానికి చెందిన కాకర్ల దుర్గారావు(35)పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. దుండగులు పరారీ అయ్యారు. హత్య జరిగిన స్థలాన్ని తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ పరిశీలించారు. హత్య జరిగిన ప్రాంతంలో క్లూస్ టీం వివరాలు సేకరించారు. తణుకు పట్టణ సీఐ కొండయ్య, ఎస్ఐలు చంద్రశేఖర్, శ్రీనివాస్ పలువురిని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
