సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలలో టీడీపీ తో పొత్తులో భాగంగా జనసేన కు 3 సీట్లు కచ్చితంగా కేటాయిస్తారని భావిస్తున్నారు. అందులో భీమవరం, నరసాపురం పక్కగా ఉంటాయి. అయితే తణుకు, టీపీ గూడెంలో ఒక సీటు జనసేనకు కేటాయిస్తారని ఒక అంచనా.. అయితే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న తణుకులో.. గత ఎన్నికలలో ఓటమి తరువాత కూడా ప్రజలతోనే ఉంటూ వస్తున్నా తణుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎట్టి పరిస్థితులలో వచ్చే ఎన్నికలలో పోటీకి సమాయత్తం అవుతుండగా .. చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చి తణుకు మీదుగా కారులో వెళుతున్నప్పుడు .. చంద్రబాబు అంత హడావిడిలోను తనను కలసిన తణుకు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ను గుర్తుపట్టి ప్రత్యేకంగా భుజం తట్టి అభినందించడం, చెవిలో ఎదో? చెప్పడంతో జనసేన లో జోష్ పెరిగిపోయింది. పవన్ కూడా గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎప్పటి నుండో తణుకులో విడివాడ రామచంద్రరావు జనంతో మమేకమవుతూ పోటీకి సర్వము సిద్ధం చేసుకొంటున్న నేపథ్యంలో ఇటీవల పరిణామం ఆయన లో మరింత దూకుడు పెంచింది. ఇక ప్రతిరోజూ జనంతో మమేకమౌతున్నారు, నేడు, గురువారం ఇరగవరం మండలం అయినపర్రు గ్రామంలో జనసేన నేతలతో కల్సి పార్టీ గుర్తు ‘గాజుగ్లాస్’ లతో సహా తాను అభ్యర్థి ని అని భావన కలిగిస్తూ ప్రచారం చేపట్టారు. పేదల జీవితాలలో మార్పులు రావాలని పవన్ కళ్యాణ్ ఏన్నో త్యాగాలు చేసి కుల రహిత, మత రహిత పార్టీ పెట్టి భావితారాలకోసం వచ్చిన పార్టీ జనసేన పార్టీ అన్నారు. అయినపర్రు గ్రామంలో చాలా అడ్వానంగా ఉన్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *